RBI: త్వరలో ఐదు కొత్త బ్యాంకుల ప్రారంభం.. 6 దరఖాస్తుల తిరస్కరణ..!

RBI: దేశంలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన ఆరు దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తిరస్కరించింది.

Update: 2022-05-20 07:30 GMT

RBI: త్వరలో ఐదు కొత్త బ్యాంకుల ప్రారంభం.. 6 దరఖాస్తుల తిరస్కరణ..!

RBI: దేశంలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన ఆరు దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తిరస్కరించింది. వాటిలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్‌ కూడా ఉంది. ఆర్‌బీఐ తిరస్కరించిన దరఖాస్తుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. 'ఈ దరఖాస్తుల పరిశీలన నిర్ణీత ప్రమాణాల ప్రకారం పూర్తయింది. ఈ సమయంలో బ్యాంకుల ఏర్పాటుకు ఇవి సరిపోవని ఆర్బీఐ' తేల్చి చెప్పింది.

UAE ఎక్స్ఛేంజ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రీపాట్రియేట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, VSoft Technologies Pvt.Ltd. దరఖాస్తులని తిరస్కరించింది. అయితే సెప్టెంబర్ 2019లో సచిన్ బన్సాల్ రూ.739 కోట్ల పెట్టుబడి నిబద్ధతతో చైతన్యలో ప్రధాన వాటాను కొనుగోలు చేశారు.

బ్యాంక్ మరియు స్మాల్ ఫైనాన్స్ కేటగిరీలో మొత్తం 11 దరఖాస్తులు రాగా ఇందులో 5దరఖాస్తులు లైసెన్సింగ్ ప్రక్రియలో ఉన్నాయి. ఫైనాన్స్ కేటగిరీలో వెస్ట్ ఎండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, రీజినల్ రూరల్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెలి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు ఉన్నాయి.

Tags:    

Similar News