Farmers Schemes: రైతుల కోసం ప్రభుత్వం అందించే 5 పథకాలు.. వీటి ప్రయోజనం పొందుతున్నారా..!

Farmers Schemes: దేశంలోని రైతులని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలని ప్రారంభించాయి. ఇందులో కొన్ని అందరికి తెలియవు.

Update: 2023-07-25 08:00 GMT

Farmers Schemes: రైతుల కోసం ప్రభుత్వం అందించే 5 పథకాలు.. వీటి ప్రయోజనం పొందుతున్నారా..!

Farmers Schemes: దేశంలోని రైతులని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలని ప్రారంభించాయి. ఇందులో కొన్ని అందరికి తెలియవు. రైతులు ఈ పథకాలకి అప్లై చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో నీటిపారుదల పథకం నుంచి ఇన్సూరెన్స్‌ వరకు అన్ని ఉంటాయి. ఏయే పథకాలు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రధాన మంత్రి కిసాన్ నీటిపారుదల పథకం

సాగునీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి పొలానికి నీరు అందించాలి. దీనికింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు, బోర్డు, ఫీల్డ్ అప్లికేషన్, డెవలప్‌మెంట్ పద్ధతులపై ఎండ్-టు-ఎండ్ మేనేజ్‌మెంట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

పంట నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులను ఒకే చోటికి చేర్చే ప్రయత్నం చేసింది. ఈ పథకం కోసం విపత్తు, తెగుళ్లు, కరువు కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తారు.

పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY)

ఈ పథకం కింద భారత ప్రభుత్వం రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తిలో ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సహాయం అందిస్తారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్

కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రారంభించింది. దీనికింద వ్యవసాయ ఖర్చులకు తగిన రుణాన్ని అందిస్తారు. ప్రభుత్వ సబ్సిడీల రూపంలో సంవత్సరానికి 4 శాతం రాయితీ రేటుతో వ్యవసాయ రుణాలు అందిస్తారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఏటా 6 వేల రూపాయలు అందిస్తుంది. దేశంలోని ఏ రైతు అయినా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు వాయిదాలలో డబ్బు అందుతుంది. ఇవి 4 నెలల వ్యవధిలో చెల్లిస్తారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News