ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 599 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే.. నాలుగు లక్షలు!

తన కస్టమర్స్ కు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీఛార్జి చేయించుకున్న వారికి జీవిత భీమా అందించనుంది.

Update: 2019-09-25 07:56 GMT

ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీ ఎయిర్ టెల్ తన కష్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీఛార్జి చేయించుకుంటే భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాట్టు వెల్లడించింది. ఎయిర్ టెల్ 599 రూపాయల రీఛార్జి తో 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. దీంతో పాటు ప్రతి రోజూ 2 జీబీ డాటా, ఉచిత కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్ ఎం ఎస్ లు ఈ ప్యాక్ లో లభిస్తాయి. ఇప్పుడు ఈ ప్యాక్ వేయించుకునే కస్టమర్లకు ఇన్సూరెన్స్ ఆఫర్ అదనంగా ఇస్తోంది ఎయిర్ టెల్. దీనిప్రకారం 599 రూపాయల రీఛార్జి చేయించుకుంటే ఆ ప్లాన్ కాలపరిమితి వరకూ నలుగు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తోంది. భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ జీవిత బీమాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. రీఛార్జి కాలం ముగిసిన వెంటనే ఈ ఇన్సూరెన్స్ కవరేజి కూడా ఆగిపోతుంది. అయితే, మళ్లీ రీఛార్జి చేసుకుంటే యాక్టివేట్ అయిపోతుంది.

కాగా, కస్టమర్లు తొలి రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ సేవలు పొందటానికి ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ రిటైలర్ వద్దకు వెళ్లి కూడా ఇన్సూరెన్స్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. 18 నుంచి 54 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే ఇన్సూరెన్స్ సేవలు లభిస్తాయి. దీనికి వైద్య పరీక్షలు కానీ, డాక్యుమెంట్లు కానీ అవసరం లేదు. ప్రస్తుతం తమిళనాడు, పాండిచెర్రీ ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఇన్సూరెన్స్ సేవలు లభిస్తాయి.


Tags:    

Similar News