Udyoga Yoga: దశమ స్థానంలో గ్రహ అనుకూలం… ఈ రాశుల వారికి త్వరలో ఉద్యోగ శుభవార్త!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి, ఉద్యోగంలో పురోగతి కోరుకునే వారికి మంచి కాలం దగ్గరపడుతోంది. దశమ స్థానం, దశమాధిపతి అనుకూలంగా ఉండడంతో కొన్ని రాశుల వారికి వచ్చే ఒకటి-రెండు నెలల్లో శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
Udyoga Yoga: దశమ స్థానంలో గ్రహ అనుకూలం… ఈ రాశుల వారికి త్వరలో ఉద్యోగ శుభవార్త!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి, ఉద్యోగంలో పురోగతి కోరుకునే వారికి మంచి కాలం దగ్గరపడుతోంది. దశమ స్థానం, దశమాధిపతి అనుకూలంగా ఉండడంతో కొన్ని రాశుల వారికి వచ్చే ఒకటి-రెండు నెలల్లో శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశాలు, ఉద్యోగులు పదోన్నతులు, స్థిరత్వం, విదేశీ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ అదృష్టం వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీనం రాశుల వారికి వర్తిస్తుంది.
వృషభం: దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో దశమాధిపతి శని బలంగా ఉండటం వల్ల నిరుద్యోగులకు తక్షణమే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. కొత్తగా చేరినవారికి స్థిరత్వం లభిస్తుంది. సీనియర్లకు పదోన్నతులు, జీత భత్యాల పెరుగుదల ఉంటాయి.
మిథునం: దశమ స్థానంలో శనిగ్రహ సంచారం, దశమాధిపతి గురువు రాశిలోనే ఉండటం వల్ల అనేక ఉద్యోగ ఆఫర్లు, ముఖ్యంగా విదేశీ అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న కంపెనీలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. సీనియర్లకు ప్రమోషన్లు వస్తాయి.
కర్కాటకం: దశమాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల స్వగ్రామం లేదా సమీపంలో ఉద్యోగం దొరకవచ్చు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. అక్టోబర్ లోగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పదోన్నతులు, అధికారుల నమ్మకం పెరుగుతుంది. స్థానచలనం జరగవచ్చు.
తుల: దశమ స్థానంలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచడం వల్ల నిరుద్యోగులు తక్షణమే ఉద్యోగం పొందుతారు. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం విదేశాల్లో పనిచేస్తున్నవారికి స్థిరత్వం వస్తుంది. పదోన్నతులు, ఇష్టమైన బదిలీలు సాధ్యమవుతాయి.
ధనుస్సు: దశమ స్థానంలో కుజుడు, దశమాధిపతి బుధుడు సూర్యునితో కలిసి ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అక్టోబర్ లోగా నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశీ ఆఫర్లు, ఉన్నత పదవులు లభిస్తాయి.
మీనం: దశమ స్థానం మీద గురు, శుక్రుల దృష్టి ఉండటం, దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అనేక ఉద్యోగ ఆఫర్లు, విదేశీ అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం, సీనియర్లకు పదోన్నతులు లభిస్తాయి. విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్లే అవకాశం ఉంటుంది.