టైలర్లుగా రాణిస్తున్న గిరిజన యువతులు

ఉన్న ఊరిలోనే దుస్తులు కుట్టి బతుకు బండి సాఫీగా సాగిస్తున్నారు గిరిజన యువతులు.

Update: 2019-09-24 09:11 GMT

శ్రీకాకుళం: ఒకప్పుడు వారంతా తల్లిదండ్రులతో కలిసి కొండపైకి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని విక్రయించడంతో వచ్చిన డబ్బులతో జీవనం గడిపేవారు. ఎంత కష్టపడినా పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. ఇప్పుడు వారి పరిస్థితి మారింది. ఉన్న ఊర్లోనే ఉపాధి దొరుకుతోంది. దుస్తులు కుట్టి బతుకు బండి సాఫీగా సాగిస్తున్నారు గిరిజన యువతులు. పదో తరగతి పూర్తిచేశాక ఇంటర్మీడియెట్‌ చదవాలంటే గిరిజన బాలికలకు సీతంపేటలో మాత్రమే గురుకుల కళాశాల ఉంది. అయితే అక్కడ కొంతమందికే సీట్లు దొరుకుతాయి. దీంతో మిగిలిన వారు చదువుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలామంది ఇంటికే పరిమితం అవుతున్నారు.

Tags:    

Similar News