మరో రెండు రోజుల్లో తిరుమల బ్రేక్ దర్శనాల విధానం రద్దు

Update: 2019-07-16 05:47 GMT

మరో రెండు రోజుల్లో తిరుమల బ్రేక్ దర్శనాల విధానం రద్దు చేయనున్నారు. L1, L2, L3 పూర్తిగా రద్దు చేయనున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులు కోరుకుంటున్నట్లు ప్రోటోకాల్, సాధారణ వీఐపీ బ్రేక్ దర్శన విధానం మొదలవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శన విధానాలపై భక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి భవిష్యత్‌లో లేకుండా చేస్తామన్నారు. సకాలంలో భక్తులకు దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. అలాగే హైదరాబాద్‌లో ఉన్నట్టు రాజధాని అమరావతిలో టీటీడీ కార్యాలయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. రాజధాని పరిసర ప్రాంత ప్రజలకు కార్యాలయం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. 

Tags:    

Similar News