దొంగతనానికి వెళ్లి 36 గంటలు బావిలోనే..

ఓ దొంగ పరిస్థితి అచ్చంగా పెనం మీదనుంచి పొయ్యిల్లో పడ్డట్టే అయ్యింది. అర్ధరాత్రి దొంగతనం చేయడానికి వచ్చాడు చుట్టప్రక్కల వాళ్లు.. చూసేసరికి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఓ దొంగ అనుకోకుండా నీళ్లులేని బావిలో పడిపోయి నడుం విరగ్గొట్టుకుని నరకయాతన అనుభవించాడు.

Update: 2019-09-06 05:44 GMT

ఓ దొంగ పరిస్థితి అచ్చంగా పెనం మీదనుంచి పొయ్యిల్లో పడ్డట్టే అయ్యింది. అర్ధరాత్రి దొంగతనం చేయడానికి వచ్చాడు చుట్టప్రక్కల వాళ్లు.. చూసేసరికి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఓ దొంగ అనుకోకుండా నీళ్లులేని బావిలో పడిపోయి నడుం విరగ్గొట్టుకుని నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని ముషినివలస పంచాయతీ పరిధిలోని కొప్పలపేటలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకెళితే.. రాత్రి గ్రామంలోకి దొంగలు చొరబడ్డారన్న సమాచారంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఇద్దరు అనుమానితులు వారికి కంటపడడంతో... ఆ ఇద్దరిని వెంబడించారు. అందులో ఒకరు ఎలాగోలా తప్పించుకున్న.. మరో వ్యక్తి మాత్రం నుంచి వారికి దొరికితే తన పనిఅయిపోతుందని అనుకున్నాడు.

దీంతో పొలాల వెంట పరుగులు తిస్తూ ప్రమాదవశాత్తు నీళ్లు లేని నేలబావిలో పడిపోయాడు. అయితే ఆ దొంగ బావిలో పడిన విషయం తెలియక గ్రామస్థులు అతడు కూడా తప్పించుకున్నాడని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక బావిలో పడిన దొంగ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా నడుము విరగడంతో లేవలేక కదలేని స్థితిలో అలాగే ఉండిపోయాడు. అలా గంట, రెండు గంటలు కాకుండా ఏకంగా 36 గంటలపాటు ఆ బావిలోనే వున్నాడు. అయితే గురువారం ఉదయం బావివైపు వచ్చిన స్థానికులు ఏవో మూలుగులు శబ్ధం వినిపిస్తుండడంతో ఏంటా అని బావిలోకి తొంగిచూసారు. దీంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దొంగను బయటకు తీశారు. దొంగను విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పుర్రెయ్‌వలసకు చెందిన టి.ఆదినారాయణగా గుర్తించారు. ఇతను చిల్లర దొంగతనాలు చేస్తుంటాడని తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి ఆదినారాయణను అప్పగించారు.

Tags:    

Similar News