Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు దుర్మరణం

Update: 2025-01-22 02:43 GMT

Road Accident: కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తోపాటు, ముగ్గురు విద్యార్థులు మరణించారు.

మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్నాటకలోని హంపి క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14మంది విద్యార్థులతో వాహనం బయలుదేరింది. ఈక్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడటంతో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మరణించారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News