తిరుమలలో వేంకన్న స్వామి కిరీటం మాయం?

తిరుమలలో కలకలం రేకెత్తింది. స్వామివారి ఆభరణాలు చోరికి గురైనట్లు తెలుస్తో్ంది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. టీటీడీ ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది.

Update: 2019-08-27 05:31 GMT

తిరుమలలో కలకలం రేకెత్తింది. స్వామివారి ఆభరణాలు చోరికి గురైనట్లు తెలుస్తో్ంది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. టీటీడీ ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. దీనిపై టీటీడీ ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసారని సమాచారం. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై టీటీడీ దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

Tags:    

Similar News