టిడిపి ఎంపీ కేశినేని నానికి పీవీపీ నోటిసులు .. ఇది చిన్న టిజరేనట ..

Update: 2019-07-16 07:02 GMT

టిడిపి నేత మరియు విజయవాడ ఎంపీ కేశినేని నానికి ప్రముఖ నిర్మాత మరియు వైసీపీ నేత పీవీపీ లీగల్ నోటిసులు పంపారు .. తనని ఆర్ధిక నేరస్థుడు అంటూ ఆధారాలు లేని విమర్శలు చేసారని , తనపై దేశంలో ఎక్కడ కూడా కేసులు లేవని అయన పేర్కొన్నారు . తనపై బుదరజల్లెందుకే ఈ విమర్శలు చేస్తున్నరని ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, క్షమాపణలు చెప్పాలని అయన తన నోటిసులో పేర్కొన్నారు . అంతే కాకుండా ఈ నోటీసులను జతపరుస్తూ అయన ఓ ట్వీట్ చేసారు అందులో "కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను" అంటూ ట్వీట్ చేసారు .. 



Tags:    

Similar News