దయచేసి ఎక్కడివారక్కడే ఉండండి.. ఏపీ సీఎం జగన్

Update: 2020-05-03 10:07 GMT
YS Jaganmohan Reddy(File photo)

పోరుగురాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఎక్కడివారక్కడే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్ది విజ్ఞప్తి చేశారు. ఏపీలో కరోనా నివారణ చర్యలపై ఈరోజు జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీ సరిహద్దుల వద్ద ఆగిపోతున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు.

కరోనా వైరస్ ప్రయాణాల వల్ల మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని అయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలను రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర హోంశాఖ మార్గరద్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఉందని, వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్ లో పెడుతున్నామని అన్నారు. వైద్య పరీక్షలు చేసి, వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని, అందువల్ల మిగిలిన వారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సూచనలు పాటించి ఎక్కడివారక్కడ ఉండండి. సురక్షితంగా ఉండండి అని అయన కోరారు.

Tags:    

Similar News