నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు...

Update: 2020-04-10 09:11 GMT

నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన్ను నగరి విడిచి వెళ్లొద్దని ఆదేశించిన జగన్ సర్కారు.. వెంకట్రామిరెడ్డి స్థానంలో శానిటైజర్ ఇన్స్‌పెక్టర్‌ సీహెచ్ వెంకటేశ్వర రావుకు ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు కట్టబెట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణ సంగతేమో కానీ, కనీసం మాస్కులకు కూడా నిధులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ప్రభుత్వం ఆయన మీద సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ సస్పెండ్ చేసింది.

'నగరిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ధ్రువీకరించారు. ప్రజలు ఇంత కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే (రోజా) ఆ సాయం అయినా చేస్తున్నారు. అది కూడా లేకపోతే ఇంకెంత కష్టంగా ఉంటుందో. ఐదు మండలాలకు అన్నం పెట్టిస్తామన్నారు. అలాంటి ఎమ్మెల్యే ఉండాలి. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. స్త్రీ అయినా కూడా ఆమె ఎంతో ధైర్యంగా ముందుకొస్తుంది. మిగిలిన వాళ్లంతా మేం నాయకులం అని ఎగబడతారు. ఇప్పుడు అసలు అడ్రస్ లేరు. ఎమ్మెల్యే మాత్రమే చేస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ పట్టించుకోలేదు. ఏదో నాలుగు మాస్క్‌లు ఇచ్చేసి చాలా చేసేశామంటున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. మేం ఎన్ని అగచాట్లు పడుతున్నాం. అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసేశారు. ఇవన్నీ తెలిసి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. కొందరు వ్యాపారులు అధికారులను నిందిస్తున్నారు. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు. ప్రజలకు ఎలాంటి సాయం అయినా చేస్తాం.' అని ఆ వెంకట్రామిరెడ్డి రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఉంది.

Full View



Tags:    

Similar News