West Godavari: దంపతుల మధ్య విభేదాలు.. భార్యపై చాకుతో దాడి చేసిన భర్త
West Godavari: పట్టపగలే హత్యా ఉదంతంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు
West Godavari: దంపతుల మధ్య విభేదాలు.. భార్యపై చాకుతో దాడి చేసిన భర్త
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆకివీడులో భార్య సంధ్యారాణిపై భర్త రాంబాబు చాకుతో దాడి చేసి హత్య చేశాడు. మెడ భాగంలో చాకుతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే భార్యపై భర్త రాంబాబు దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలే హత్యా ఉదంతంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.