మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇకలేరు: కోడెల జీవిత విశేషాలు

టీడీపీ సీనినియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అయన తుదిశ్వాస విడిచారు

Update: 2019-09-16 07:59 GMT

టీడీపీ సీనినియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అయన తుదిశ్వాస విడిచారు

తెలుగుదేశం పార్టీ వీనియర్‌ నేత అయిన కోడెల శివ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఎన్నికైన తొలి శాసన సభాపతిగా సేవలందించారు.

వైద్య వృత్తిలో ఉన్న అయన 1983 లో వైద్య వృత్తి వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1983 నుంచి 2004వరకు వరసగా ఐదుసార్లు నరసరావు పేట మంది గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఓటమిపాలైన్ అయన 2014లో అంధ్రప్రదేశ్‌ శాసనసభకు పత్తెనపల్లి నుంచి తెలుగుదేశం తఫున గెలిచారు.

అసెంబ్లీకి అరుసార్డు ఎన్నికైన దాక్టర్‌ కోడెల ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు.

కోడెలవప్రసాదరావు గుంటూరు బిల్లా, నలరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్పమ్మ. దిగువ మద్యతరగతి కుటుంబానికి చెందినవారు. అయన అయిదో తరగతి వరకూ న్వగ్రామంలోనే చదివారు. కొద్ధిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నరసరావుపేటలో పదో తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివారు.

చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్‌ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆయన తాతయ్య ప్రోత్సాహంతో మెడిసిన్ చదవడానికి ముందుకు వెళ్ళారు.

తరువాత గుంటూరు ఎ.వి కళాశాలలో చేరి మళ్లీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాళాలలో చేరారు. రెండున్నరేళ్ళ తరువాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

వారణాసిలో ఎం.ఎన్‌ పూర్తిచేసిన కోడెల నరసరావుపేటలో సొంతంగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. అనతి కాలంలోనే తిరుగులేని సర్జన్ గా పేరు తెచ్చుకున్నారు. పల్నాడులో అప్పటీకే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచరాలకు దాక్టర్‌ కోడెల శివప్రసాదరావే సరైన వ్యక్తి అని బావించిన ఎఫ్ట్‌ఆర్‌ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యావింారు.

రాజకీయాలు ఇష్టం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూవే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యనారాయణ).ముగ్గురు కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు.


Tags:    

Similar News