టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే, బాలకృష్ణకు ఫోన్..

Update: 2019-03-01 02:24 GMT

కనిగిరి మాజీ శాసనసభ్యుడు, డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం తెలుగుదేశంలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన చేరికకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరబోతున్నారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అనంతరం కూడా ఆ పార్టీలోనే కొనసాగారు. వైయస్ మరణానంతరం వైసీపీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే ముక్కు కాశిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన చేరికను స్వాగతించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. కనిగిరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కదిరి బాబురావు ఉన్నారు.

ఆయన పట్ల నియోజకవర్గ కార్యకర్తల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఉంది. దాంతో ఉగ్రకు ఈసారి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరునెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. ఉగ్రసేన పేరుతో కనిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ఉగ్ర చేరికను కదిరి బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినీనటుడు బాలకృష్ణతో కదిరి ఫోనులో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. 

Similar News