అక్కడ పిడుగులు పడే అవకాశం!

Update: 2019-03-09 03:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎండ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికంగా రికార్డవుతున్నాయి. రెండు మూడు రోజులుగా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అంతేకాదు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలుపుతోంది.

మరోవైపు రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగనుంది. శనివారం సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులు వడగాడ్పుల ప్రభావం ఉండదని ఐఎండీ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తిరుపతితో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. 

Similar News