అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్‌

Update: 2020-02-08 11:50 GMT

'దిశ' చట్టం ప్రత్యేకమైందని చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యత అని ముఖ్యంగా మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకు వచ్చినట్లు జగన్ చెప్పారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లైననా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలాదేని అసహనం వ్యక్తం చేశారు.

మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట వేస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు ఏపీ సీఎం జగన్. రాజమండ్రిలో దిశ తొలి మహిళా పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేరస్థులతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. 'దిశ' చట్టం దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమన్నారు సీఎం జగన్. ఈ నెలాఖరునాటికి రాష్ర్టంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు.

దిశ ఘటన చాలా బాధించిందని చెబుతూ చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే అఘాయిత్యాలను ఆపగలుగుతామన్నారు. నేరాలను అదుపులోకి తీసుకువచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే ఏడు రోజుల్లోపే దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్షపడేలా చట్టం రూపొందించామని చెప్పారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లైనా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని అసహనం వ్యక్తం చేశారు.

మహిళల భద్రత కోసం సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సముచిత అవకాశం కల్పిస్తున్నారని ప్రశంసించారు.

దిశ చట్టానికి సంబంధించిన యాప్ ను సీఎం జగన్ ప్రారంభించారు. అంతకు ముందు దిశ ఘటనపై మహిళా సంఎక్షేమ శాఖ రీసెర్చ్ అధికారి దినేష్ రచించిన ప్రతిజ్ఞను సభలో చదివి వినిపించారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రులు తానేటి వనిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, రజిని, డీజీపీ గౌతం సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News