నేడు శ్రీకాకుళంకు జగన్.. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ శ్రీకాళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పలాస, ఎచ్చర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Update: 2019-09-06 00:47 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ శ్రీకాళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పలాస, ఎచ్చర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యాటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయల్దేరి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం పదకొండు గంటలకు కాశీబుగ్గ చేరుకుంటారు. ఉద్దానం తాగునీటి సరఫరా ప్రాజెక్టు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి, పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటి కిడ్నీ ఆస్పత్రి, రిసెర్చ్ సెంటర్ భవనాల నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు.

నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎచ్చర్లకు చేరుకుంటారు. ఎస్ఎం పురంలోని ట్రిపుల్ ఐటీలో నూతనంగా నిర్మించిన అకడమిక్, వసతి గృహ బ్లాక్ ను ప్రారంభించి.. విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ త్రవాత శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగుపురంలోని అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ చేరుకుని విమానంలో విజయవాడకు వెళ్ళనున్నారు. సీఎం జగన్ పర్యటన దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Tags:    

Similar News