అన్న క్యాంటీన్లు ఉంటే.. వలస కూలీల ఆకలి తీర్చేది : చంద్రబాబు

ప్రస్తుతం రాష్ట్రంలో అన్న క్యాంటీన్స్ ఉంటే వలస కూలీల ఆకలి తీర్చేవని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2020-05-16 10:34 GMT
Chandrababu Naidu(File photo)

ప్రస్తుతం రాష్ట్రంలో అన్న క్యాంటీన్స్ ఉంటే వలస కూలీల ఆకలి తీర్చేవని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.రాష్ట్రానికి కేంద్రం స్పందించి ఉదారంగా అంతో ఇంతో చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేది శూన్యం అని చంద్రబాబు మండిపడ్డారు.. శుక్రవారం ఆయన పార్టీ మండల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన అధికార ప్రభుత్వంపై మండిపడ్డారు.. కేంద్రం ముందుగా స్పందించి మూడు నెలల రేషన్‌ ఉచితంగా ఇచ్చిందని, అంతేకాకుండా మరో రెండు నెలల రేషన్‌ ఇస్తానని ప్రకటించిందని కానీ ఏపీ ప్రభుత్వం చేసింది శూన్యం అని అన్నారు.

అంతేకాకుండా రైతు భరోసా పేరుతో అధికార పార్టీమోసం చేస్తోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఐదేళ్లకు కలిపి కేవ లం రూ. 37 వేలు ఇస్తోందని, టీడీపీ గెలిచి ఉంటే అన్నదాతా-సుఖీభవ పధకం కింద ఐదేళ్లకు కలిపి రూ.75 వేలు అందేవని, ఇక రుణ మాఫీ కిస్తీలు కూడా కలుపుకొంటే రైతుకు రూ.1.15 లక్షలు అందేవని అన్నారు. దీనివలన రైతులు రూ.78 వేలు నష్టపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు..ఒకవేళ మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే వారికి ఈ బకాయిలు 24 శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News