జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ టీమ్‌పై దాడి

Update: 2019-02-10 13:57 GMT

జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ డ్యాన్స్ టీమ్‌పై శ్రీకాకుళం చిన్నబరాటం వీధికి చెందిన యువకులు దాడి చేశారు. కళింగాంధ్రా ఉత్సవాల్లో ప్రోగ్రాం ముగించుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రీన్ రూమ్‌లో బౌన్సర్‌లు, యువకులు మధ్య వివాదం చోటుచేసుకుంది. దాంతో నరేష్ డ్యాన్స్ టీమ్‌ సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నంలో ఈ వివాదం మరింత చెలరేగినట్టు తెలుస్తోంది. దీంతో నరేష్ బృందం తిరుగుప్రయాణం అయ్యాక మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దీంతో నరేష్ తోపాటు కొందరికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. దాడికి పాల్పడిన ఓ యువకుడిని పట్టుకొని ఘటనాస్థలిలో ఉన్న కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను అదేశించారు.

Similar News