ttd board: సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

టీటీడీ పాలక మండలి నియామకానికి ఏపీ సీఎం జగన్ ఈరోజు ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం జగన్ ను పాలకమండలి చైర్మన్ సుబ్బారెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సమయంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సాయంత్రానికి ఈ విషయంపై పూర్తీ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Update: 2019-08-28 07:38 GMT

టీటీడీ పాలకమండలికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాలక మండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 25కు పెరిగింది. దీనిపై సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. పాలకమండలి సభ్యులుగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ .. అలాగే ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను నియమించే అవకాశం ఉంది.

స్థానిక ఎమ్మెల్యే కోటలో భూమన, చెవిరెడ్డికి చోటు కల్పించనున్నారు. ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌‌కు పాలకమండలిలో చోటు కల్పించే అవకాశం ఉంది.

మహా సిమెంట్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు కూడా స్ధానం కల్పిస్తారని తెలుస్తోంది. మహిళా కోటాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి చోటు దక్కుతుందని సమాచారం.


Tags:    

Similar News