ఏపీ మాజీ సీఎం చంద్రబాబు టూర్ రద్దు!

Update: 2019-06-05 17:16 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలసి విదేశీ యాత్రకు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 7 వ తేదీన ఆయన టూర్ కు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఇపుడు ఆ టూర్ ను అయన రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా తన విహార యాత్ర రద్దు చేసుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు, ఎంపీ కేశినేని నాని అంశం పార్టీలో విభేదాలను తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విహారయాత్రకు వెళ్లడం సబబుకాదని చంద్రబాబు భావించినట్టు సమాచారం. శాసనసభ సమావేశాల కోసం పార్టీని సన్నద్ధం చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.

Tags:    

Similar News