ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..

Update: 2019-01-27 01:52 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజూ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారాయన. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 31 న మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకి సెలవని, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా గత ఏడాది లక్షా 93 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ రెండు లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. 

Similar News