పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ కౌంటర్

Update: 2019-08-09 08:28 GMT

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ము‌ఖ్యమంత్రి కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని, అందుకే ఆయన సీఎం అయిన తర్వాత ఏ ఒక్కరూ కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్‌వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే... కాగా దీనిపై ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సీఎంను వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. అసలు కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సెటిల్‌ అయిన తర్వాత తప్పనకుండా కలుస్తామని ఆయన తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకులంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజలకు తాగునీరందించే ముఖ్యమంత్రి తమకు దేవుడని ఆయన వ్యాఖ్యనించారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కలవాల్సిఉందని అయితే కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడురోజుల్లో కలిసేందుకు ఆయన అపాయింటుమెంట్ ఇచ్చారని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News