

Eluru: ఏలూరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంవిధాన్ దివస్ ర్యాలీ!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో సంవిధాన్ దివస్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పోక్సో స్పెషల్ జడ్జి కె. వాణిశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి జీవించాలన్నారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.


Makthal: ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: మక్తల్ సీఐ రామ్ లాల్!
మక్తల్ నియోజకవర్గం కృష్ణ పోలీస్ స్టేషన్ వద్ద సీఐ రామ్ లాల్, ఎస్సై ఎస్.ఎం. నవీద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దని అధికారులు సూచించారు.


Cyberabad: పోలీస్ బాస్‌లకు హైకోర్టు షాక్.. సైబరాబాద్ సీపీ, డీసీపీకి జైలు శిక్ష
తెలంగాణ హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్, మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష విధించింది.


Vikarabad: అనంతగిరిలో అంగరంగ వైభవంగా కార్తీకమాస జాతర ఉత్సవాలు!
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కొలువై ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో కార్తీకమాస జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముత్యాల పందిరి సేవపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వగా, అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Watch: నాన్న చివరి చూపు కూడా దక్కలేదా? ఎయిర్‌పోర్టులో కుమారుడి కన్నీటి వేడుకోలు
తండ్రి మరణవార్త విని ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడికి స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది.


AP Pension: ఏపీ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 1 కంటే ముందే డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌దారులకు కీలక సమాచారం. డిసెంబర్ నెల పింఛన్‌ను ఈసారి నవంబర్ 30 నుంచే పంపిణీ చేయనున్నారు. ఆ రోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 1న కూడా అందించే ఏర్పాట్లు చేశారు.


Telangana Police: కారులో ఒక్కరే వెళ్తే ఫైన్ పడుతుందా? హైదరాబాద్ పోలీసుల క్లారిటీ
Telangana Police: హైదరాబాద్‌లో కారులో ఒక్కరే ప్రయాణిస్తే జరిమానా విధిస్తారన్న ప్రచారంపై తెలంగాణ పోలీసులు స్పష్టత ఇచ్చారు. అలాంటి నిబంధనలు లేవని తేల్చి చెప్పారు.


UK Military: రష్యాతో యుద్ధానికి బ్రిటన్ రెడీ.. లక్ష మంది మాజీ సైనికులకు లేఖలు
UK Military: రష్యాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిటన్ కీలక చర్యలు చేపట్టింది. సుమారు లక్ష మంది మాజీ సైనికులను సంప్రదించి, అవసరమైతే తిరిగి సేవలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.


Aircraft Accident: హైదరాబాద్‌లో చెట్టును ఢీకొన్న విమానం.. ట్రైనీ పైలట్‌కు తీవ్ర గాయాలు
Aircraft Accident: హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో గురువారం (నవంబర్ 26) శిక్షణ విమానం అత్యవసరంగా కిందకు దిగింది.


ఇన్వెస్కో కొత్త డెట్ ఫండ్.. రూ.1,000తో పెట్టుబడి
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్త డెట్ ఫండ్‌ను ప్రారంభించింది, ఇది 2026లో NFOతో అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000, మరియు ఎన్ఎఫ్ఓ ముగిసిన తర్వాత కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఫండ్ AA+ రేటింగ్ కలిగిన కార్పొరేట్ డెట్ సాధనాలు, A1+ రేటింగ్ ఉన్న మనీ మార్కెట్ సాధనాలపై దృష్టి సారిస్తుంది.


Baswapur: బస్వాపూర్‌లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పోచారం!
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.


Kotagiri: బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేయించిన ఎమ్మెల్యే పోచారం!
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామానికి చెందిన బామిని మేఘ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశం చేయించి, యజమాని మేఘ శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. స్థానిక సర్పంచులు, నేతలు పాల్గొన్నారు.