

Khammam: ఖమ్మంలో ఘనంగా ముగిసిన ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టోర్నీ!
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం ముగిసిన తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మెట్రో జోన్ విజేతగా, మహబూబ్‌నగర్ రన్నరప్‌గా, హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ తృతీయ స్థానంలో నిలిచాయి. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు సైతం ఉత్సాహంగా పాల్గొనడం యువతకు స్ఫూర్తిదాయకమని అతిథులు కొనియాడారు.


Raghunathapalem: ఇన్‌స్టాగ్రామ్‌లో మారణాయుధాల ప్రదర్శన.. ఆటో యూనియన్ నేతపై కేసు!
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులు ప్రదర్శిస్తూ, 'ఠాగూర్ సెటిల్‌మెంట్ల' పేరుతో రౌడీలా రీల్స్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని గత నేర చరిత్రపై విచారిస్తున్నారు.


Ghatkesar: చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ కొండాపూర్ వైష్ణవి రెసిడెన్సీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యంనంపేట్ ఎక్స్ రోడ్డు వద్ద 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి 10 తులాల బంగారం, 24 తులాల వెండి, రెండు ఐఫోన్లు, రూ.53 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Pinapaka: దుగినేపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రం ఏర్పాటు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీలో బుధవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.5 లక్షల బీమా పథకం కోసం అర్హులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. సర్పంచ్ కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ సందీప్ పాల్గొన్నారు.


iQOO 16: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐక్యూ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేయబోతోంది. వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ నుంచి వస్తున్న ఐకూ 16 త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ను ఇండియాలోనూ తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అమెజాన్‌లో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ఫోన్ లాంచ్‌పై ఆసక్తి పెరిగింది. 5.01GHz వరకు క్లాక్ స్పీడ్ ఉన్న స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అయితే భారత్‌లో లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.


Rayaparthy: మైలారం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్!
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన, వసతులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. అంగన్వాడీ పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.


WhatsApp: ఫ్రీగా యాప్, యాడ్స్ కూడా లేవు.. అయినా వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తో విడదీయలేని అనుబంధం ఉంటుంది. 2009లో జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ కలిసి రూపొందించిన ఈ యాప్, ప్రస్తుతం 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ వేదికగా ఎదిగింది. అయితే యూజర్ల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, యాప్‌లో కనీసం ఒక్క యాడ్ కూడా చూపించకుండా వాట్సాప్ ఏటా కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తోందనే సందేహం చాలామందికి వస్తుంది. దీని వెనుక ఒక తెలివైన వ్యాపార వ్యూహం దాగి ఉంది.


Gambhiraopet: బాత్రూం వెళ్లాడని 4 ఏళ్ల బాలుడిని క్లాస్ బయట కూర్చోబెట్టిన స్కూల్!
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాత్రూం వెళ్లాడని నాలుగేళ్ల ఎల్కేజీ బాలుడిని బయట కుర్చీలో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. ప్రశ్నించిన తల్లిదండ్రులకు కరస్పాండెంట్ దురుసుగా సమాధానమివ్వడంతో డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఇది సరైన పద్ధతి కాదని యాజమాన్యానికి సూచించినట్లు ఎంఈఓ గంగారాం తెలిపారు.


Sircilla: సిరిసిల్లలో నవంబర్ 27న మినీ జాబ్ మేళా
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న (శుక్రవారం) సిరిసిల్ల జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి నిర్మల తెలిపారు. ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జనరల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు.


Vemulawada: రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు: మున్సిపల్ కమిషనర్ లోకేష్!
రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదని వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ బుధవారం హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకుండా రెండో బైపాస్ రోడ్డులో చెత్త వేస్తున్న కొబ్బరి బోండాల వ్యాపారికి సిబ్బంది రూ.1,000 జరిమానా విధించారు. చెత్తను మున్సిపల్ వాహనాల్లోనే వేసి స్వచ్ఛ వేములవాడకు సహకరించాలని కోరారు.


Hyderabad: దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా
దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ Artificial Intelligence) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ మరియు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్, ఐపీఎస్ గార్లు బుధవారం (25.11.2026) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ కొనసాగుతున్న సాంకేతిక పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.


Peddapalli: రాజీనామా లేదిక.. చాంబర్ అధ్యక్షుడిగా కొనసాగుతా: కమల్ కిషోర్ శారద!
కమిటీ సభ్యుల ఆమోదంతో తన రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకుని పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొనసాగుతానని కమల్ కిషోర్ శారద బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తొందరపాటు నిర్ణయంతో అధికారులకు ఇబ్బందులు కలిగిస్తే క్షమించాలని కోరుతూ, పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు.