జనతా కర్ఫ్యూని పక్కనపెట్టి ఈ యువకులు ఏం చేసారో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూని కొనసాగిస్తున్నాయి.

Update: 2020-03-22 10:43 GMT
Youth Playing Cricket in MGBS

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజలంతా స్వచ్చందంగా కర్ఫ్యూలో భాగస్వాములవుతున్నారు. బస్సులు, రైల్లు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సుడిపోలలు, రైల్వేస్టేషన్లన్నీ నిర్మాణుష్యంగా మారి పోయాయి. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్ పరిధిలో కొన్నిఆసక్తికర సన్నివేశం కెమెరాకి చిక్కాయి. బస్సు డిపోలన్నీనిర్మానుష్యంగా ఉండి బస్సులను పార్కింగ్ చేసే స్థలం అంతా వెలవెలబోతున్నాయి. దీంతో బస్టాప్ కి సమీపంలో ఉన్న కాలనీకి చెందిన కొంత మంది యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాణుష్యంగా ఉన్న బస్టాండ్ పార్కింగ్ ప్లేస్ ని ప్లే గ్రౌండ్ చేసేసారు.

ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ కూడా లెక్క చేయకుండా యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఇదేంటి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది కదా మీరు బయటికి వచ్చారేంటని యువతను ప్రశ్నించగా ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే ఇలా క్రికెట్ ఆడుతున్నాం అని షాక్ ఇచ్చారు. ప్రభుత్వాలు చెప్పిన మాటలు కూడా లెక్క చేయకుండా యువకులు క్రికెట్ ఆడుతుండడంతో కొంత మంది వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News