వయసు చిన్నది.. మనస్సు గొప్పది

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లలో మాస్క్ లకు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయి మార్కెట్ లో వాటి కొరత ఏర్పడుతుంది.

Update: 2020-04-08 06:18 GMT
Ravalika Masks Distribution

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లలో మాస్క్ లకు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయి మార్కెట్ లో వాటి కొరత ఏర్పడుతుంది. దీంతో చాలా మందికి మాస్కులు కాని, శానిటైజర్లు కాని అందుబాటులో ఉండడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన కొంత మంది తామే సొంతంగా మాస్కులను తయారు చేసుకుంటున్నారు. మరి కొంత మంది మాస్కులను కుట్టి ఇతరులకు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాక్ పట్ల గ్రమంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువతి స్వయంగా మస్కులను కుట్టి గ్రామంలో ఉన్నవారికి పంపిణీ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. సోన్ మండలం పాక్‌పట్లకు చెందిన మెరుగు నర్సయ్య-పుష్పలతకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వీరిలో రవళిక మొదటి సంతానం. ఆమె ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ, కుటుంబానికి చేదోడుగా ఉండడానికి జనతా బ్యాగులు కుడుతుంది. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిచెందుతుండడంతో ఐకేపీ ఏపీయం సులోచన ప్రోత్సాహంతో రవళిక సమాజానికి తనవంతు సహాయం చేస్తుంది. తనకు వచ్చిన విద్యతోనే తన దగ్గర ఉన్న బట్టలతో మాస్కులను కుట్టి గ్రామస్తులకు, ఇతర గ్రామాల ప్రజలకు ఉచితంగా అందజేస్తుంది. కరోనా వైరస్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆమె ప్రజలకు చెపుతుంది.

దీంతో పలువురు అధికారులు ఆమెని అభినందిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఓ చిన్నారి తాను దాచుకున్న పాకెట్ మనీని ప్రభుత్వానికి తన వంతు సాయంగా విరాళం అందించి పెద్ద మనసు చాటుకున్నాడు. తలకొక్కుల హర్ష అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలెక్టర్ ఆఫీస్ కి వెల్లి తాను దాచుకున్న రూ. 2వేలను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారుఖీకి అందజేశారు. ఆ చిన్నారి పెద్ద మనసును చూసిన కలెక్టర్ హర్ష నుంచి 500 తీసుకుని మిగతా 1500 చిన్నారికి ఇచ్చేసారు. హర్ష తల్లిదండ్రులు సైతం ఫుడ్‌బ్యాంక్‌ నిర్వహిస్తూ పేదలకు అన్నదానం చేస్తున్నారు.


Tags:    

Similar News