యాదాద్రి జిల్లాలో పొంగిపొర్లుతున్న బిక్కేరు వాగు

♦ ప్రవాహం చూసేందుకు వచ్చి కొట్టుకుపోయిన యువకుడు ♦ చెట్టును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న యువకుడు ♦ తాడు సహాయంతో యువకుడిని బయటకు లాగిన స్థానికులు

Update: 2019-10-13 09:55 GMT

 బిక్కేరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఓ చెట్టు కాపాడింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జిల్లా బిక్కేరు వాగు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వాగు  దగ్గరకు చేరుకున్నారు. సరదాగా ప్రవాహాన్ని చూస్తున్న ఓ యువకుడు వాగులోకి దిగాడు. వరద ఉధృతికి వాగులో కొద్ది దూరం  కొట్టుకుపోయాడు.

అదృష్టవశాత్తు ఓ చెట్టు కనిపించడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. యువకుడు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై తాడు సాయంతో బయటకు లాగారు. క్షేమంగా యువకుడు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News