యువత కోసం రామకృష్ణమఠం ప్రత్యేక కార్యక్రమం..

ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి 19వ శతాబ్దంలో రామక్రిష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్థాపించారు.

Update: 2020-02-05 06:46 GMT

ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి 19వ శతాబ్దంలో రామక్రిష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్థాపించారు. ఈ మఠం ద్వారా ఎంతో మంది యువత ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇదే కోణంలో హైదరాబాద్‌లోని రామకృష్ణమఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ యువకుల కోసం 'శ్రద్ధ' అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

యాద్రాద్రి భువనగిరి జిల్లా కీసర మండలం బొమ్మలరామారంలోని రామకృష్ణ మిషన్ లో ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారన్నారు. ఎంతో మంది యువతకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే ఈ కార్యక్రమానికి 18 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు గల వారు పాల్గొనవచ్చని తెలిపారు. వారిలో మొదటి 50 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాం ఉందని తెలిపారు. వీరి కోసం హైదరాబాద్ దోమలగూడలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసామని తెలిపారు. దీని కోసం అభ్యర్థులు శిక్షణ నిమిత్తం రూ.200 సాధారణ ఫీజును చెల్లించాలని తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే యువత తెల్లని రంగు ఫార్మల్ దుస్తులు ధరించాలని తెలిపారు. జీన్స్, టీషర్టులు ధరిస్తే వారికి అనుమతించమని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నిపుణులతో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సెషన్, క్యారెక్టర్ బిల్డింగ్, డివోషనల్ మ్యూజిక్ అండ్ మెడిటేషన్, బ్రెయిన్‌స్ట్రామింగ్ సెషన్ లు ఉంటాయని వారు తెలిపారు.   

Tags:    

Similar News