నన్నే ఆపుతారా.. బాంబ్ పెట్టి లేపేస్తా...పోలీసులపై తిరగబడ్డ వ్యక్తి ఎవరో తెలుసా..

Update: 2020-04-30 09:57 GMT

ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలను పకడ్బందీగా అమలు చేసింది. ఇందులో బాగంగానే ప్రజలు బయటికి రాకుండా లాక్ డౌన్ విధించి ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయినా చాలా మంది ప్రజలు పని ఉన్నా లేకపోయినా కావాలని బయటికి వచ్చి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు అలాంటి వారిని ఆపినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. కొంత మంది పోలీసుల చేతిలో బుక్ అయి బండ్లను సీజ్ చేయించుకుంటున్నారు. మరికొంత మంది పోలీసులపై తిరగబడి దాడులకు దిగుతున్నారు. నిన్న ఒక్క రోజే పోలీసులపై తిరగబడిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ రోజుకూడా ఓ వ్యక్తి తనను ఆపినందుకు పోలీసులపై దాడిచేసినంత పని చేసాడు.

హైదరాబాద్‌ నగరంలోని లంగర్‌హౌస్‌ టిప్పు ఖాన్ బ్రిడ్జి వద్ద పోలీసులు తమ విధుల్లో భాగంగా వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఓ వ్యక్తి హెల్మెట్, మాస్కు ఏమీ పెట్టుకోకుండానే రోడ్డుపై చక్కర్లు కొడుతున్నాడు. అది గమనించిన పోలీసులు అతన్ని ఆపారు. ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించినా పోలీసులు అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బైక్ తాళాలు తీసుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహించిన ఈ వ్యక్తి బూతులు తిట్టడం ప్రారంభించాడు. నన్నే ఆపుతారా.. మీ అంతు చూస్తా' వాహనం పైనుంచి దిగనంటే దిగనని రోడ్డు మీద గోల గోల చేసాడు. పోలీసులపై తిరగబడ్డాడు. అంతే కాదు బాంబ్ పెట్టి లేపేస్తా, పోలీస్ స్టేషన్ మొత్తాన్ని లేపేస్తా అంటూ పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. మీ పై అధికారులను పిలుస్తారా పిలవండి అంటూ సవాల్ చేసాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతని గురించి ఆరా తీయగా అతను ఎవరూ అనే అసలు నిజం బయటపడింది. ఏడాది కిందట అతని భార్య చనిపోవడంతో అతను పిచ్చివాడిలా తయారయ్యాడని, రెండునెలల క్రితమే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. అప్పుడప్పుడు అతను ఇదే విధంగా ప్రవర్తిస్తాడని తెలియడంతో పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags:    

Similar News