సిరిసిల్లా సహకార చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సహకార సంఘం చైర్మన్‌ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు.

Update: 2020-02-16 08:49 GMT

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సహకార సంఘం చైర్మన్‌ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పెద్దూరు ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో 13 డైరెక్టర్ స్థానాలకు 6 టీఆర్‌ఎస్ మద్దతుదారులు, ఆరు స్థానాలు బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నరు. ఒక స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి గెలుపొందాడు.

స్వతంత్ర అభ్యర్థి బీజేపీ మద్దతుదారుల వైపు ఉండటంతో తమ వైపు తిప్పుకోవడానికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.ఈ క్రమములో స్థానిక బిజెపి మద్దతుదారునిపై టి.ఆర్.యస్. మద్దతుదారులు దాడి చేసి చితకబాదారు. బందోబస్తులో ఉన్న పోలీసులు దాడిని అడ్డుకొని, ఇరు వర్గాలను దూరముగా పంపించి వేయడంతో, గొడవ సద్దుమణిగింది.


Full View


Tags:    

Similar News