తెలంగాణలో పెరిగిన కేసులపై గవర్నర్ తమిళిసై 'వార్నింగ్' ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య ఇంతకింత పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2020-06-01 10:24 GMT
Tamilisai Soundararajan(file photo)

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య ఇంతకింత పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు పెరిగిపోవండంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో జాగ్రత్త చర్యలను తీసుకుంటుందని అయినా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు. ఒకే ఒక్క రోజు రికార్డు స్ధాయిలో రాష్ట్రంలో 199 కేసులు నమోదయ్యాయన్న వారిలో ఇద్దరు మెడికోలు కూడా ఉన్నారని గవర్నర్ తెలిపారు. ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం వలన ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ప్రజలకు ఇది ఒక హెచ్చరిక అని, కరోనాను తరిమేయడానికి అందరం కలిసి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారంటే దాని అర్థం జాగ్రత్త చర్యల విషయంలో సడలింపు ఇచ్చినట్లు కాదని గవర్నర్ తెలిపారు. లాక్‌డౌన్ 5 రిలాక్సేషన్ వైరస్‌కు కాదు విలువలకు అని గవర్నర్ తెలిపారు. మనం అన్‌లాక్ 1 దిశగా ప్రయాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. మనమంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 82 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2689కి చేరిందని, వీటిలో 2264 కేసులు స్థానికంగా నమోదైనవి ఉన్నాయన్నారు. ఇక విదేశాలు, వలస కార్మికుల వల్ల మిగతా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.



 HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News