Coronavirus: అప్రమత్తంగా ఉండండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై

భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ భయంకర పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంరద్యరాజన్ అన్నారు.

Update: 2020-03-21 04:00 GMT
Telangana governor Tamil Isai soundararajan

భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ భయంకర పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంరద్యరాజన్ అన్నారు. ప్రస్తుతం దేశం బయోవార్ ను ఎదుర్కొంటున్నదని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ సోదర సోదరీమణులు చేతులు బాగా శభ్రం చేసుకోవాలని తెలిపారు. మనిషికి మనిషికి మధ్య మీటరు దూరాన్ని పాటించాలని తెలిపారు. ఎవరూ బయటికి వెల్లకూడదని, ఇంట్లోనే ఉండాలని అన్నారు. 'కోవిడ్‌'లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని గవర్నర్‌ కోరారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. ప్రభుత్వం మీతో ఉందని గవర్నర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

కరోనా సోకిన వారి పట్ల వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశం ఎదురుకుంటున్న బయోవార్ బయోవార్ ను ఎదురుకోవడానికి వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా రవాణా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నాన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల సెల్ఫ్‌ క్వారంటైన్‌ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇక 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని అన్నారు. ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. 65ఏళ్లు పైబడిన వారిని బయటకు పంపకుండా చూసుకోవాలని హెచ్చరించారు. రాజ్‌భవన్‌లో ఉద్యోగులు ప్రతి రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని, ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నామని ఆమె తెలిపారు. మీడియా సమావేశానికి వచ్చిన గవర్నర్‌కు రాజ్‌భవన్‌ వైద్య బృందం థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. 

Tags:    

Similar News