Dilshuknagar Bomb Blast: ఆ మారణకాండకు నేటితో ఏడేళ్లు

2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6:45గంటల సమయం. చిన్నా పెద్దా అందరూ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో సరాదాగా తిరుగుతున్నారు. మరి కొంత మంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

Update: 2020-02-21 06:00 GMT

2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6:45గంటల సమయం. చిన్నా పెద్దా అందరూ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో సరాదాగా తిరుగుతున్నారు. మరి కొంత మంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ ప్రాంతమంతా జనాలతో నిండి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఓ శబ్దం. కల్లు మూసి తెరిచే లోపే ఏదో తెలియని గందర గోళం. కొంతమంది విగతజీవులాగా ఆ రోడ్డుపై పడి ఉంటే, మరికొంత మంది గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్నారు.

పగపట్టిన పరాయి దేశం ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ జంట పేలుళ్లలో దాదాపుగా 17 మంది మాంసపు ముద్దలైపోయారు. 130 మంది గాయాలయ్యాయి. సరిగ్గా ఈ పేలుళ్ల ఘటన జరిగి ఈ నాటికి ఏడేల్లు పూర్తయ్యాయి. ఈ సంఘటనలో చనిపోయిన వారికి బాధిత కుటుంబాలు, స్థానికులు ఇవాళ నివాళులర్పించారు.

ఈ రోజున జరిగిన ఈ ఘటనలో మొదట మలక్ పేట, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో 2013 మార్చి 13న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) దర్యాప్తు చేపట్టింది. అనంతరం చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఎన్ఐఎ మూడేళ్లపాటు విచారణ జరిపింది.

ఈ ఘటనకు ఇండియన్ ముజాహిదినే పాల్పడినట్టు తేల్చింది. దీనికి సంబంధించి 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్ ను పరిశీలించింది. 2016 నవంబరు 7న వాదనలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. నిందితులందరూ దోషులేనని 2016, డిసెంబర్ 13న ఎన్ఐఎ కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడు. అసదుల్లా అఖ్తర్, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌ షేక్‌ లను ఉరికంబం ఎక్కించాలని తీర్పు చెప్పింది. 


Full View


Tags:    

Similar News