బస్సులలో చార్జీల పట్టిక

అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నడిపిస్తున్న బస్సులలో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

Update: 2019-10-10 08:11 GMT

 అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నడిపిస్తున్న బస్సులలో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని రంగారెడ్డిజిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా నడిపించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్‌ బస్సులు ఈ నిబంధనను పాటించాలని స్పష్టం చేశారు. చార్జీలను అదనంగా వసూలు చేయవద్దని బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీస్‌ అధికారులు, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్‌ బస్సులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్‌ చేయాలని సూచించారు.  

Tags:    

Similar News