లాక్‌డౌన్‌లో రోడ్ల అభివృద్ధి.. కేటీఆర్‌ ట్వీట్‌

లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను సంపూర్ణంగా పూర్తి చేసింది.

Update: 2020-05-24 10:27 GMT

లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను సంపూర్ణంగా పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా నగరంలోని రోడ్లన్నింటిని పూర్తి వాహనదారులకు అద్భుతమైన రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నగరంలోని రహదారులు అద్దాల్లా మెరిసిపోతున్నాయి. ఎక్కడా కూడా గుంతలు కనిపించ కుండా ఉండడంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా చేస్తున్నారు. ఇంత అద్భుతంగా అధికారులు రోడ్లను పూర్తి చేయడంతో మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేసి జీహెచ్‌ఎంసీ అధికారులను అభినందించారు. నగరంలోని రహదారుల అభివృద్ధిపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సాధారణంగా నగరంలోని రోడ్ల అభివృద్ధికి రోజుకు 3 నుంచి 4 గంటలు సమయం మాత్రమే కేటాయించేవారు. దీంతో ఆ పనులు పూర్తి చేయడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టేది. ఒక వైపు రోడ్లు పూర్తయ్యే లోపే ముందుగా వేసిన రోడ్లన్నీ మళ్లీ రిపేర్ కి వచ్చేవి. కానీ కరోనా వైరస్ ను అరికట్టేందుకు అమలుచేసిన లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం ప్రతి రోజు 14 నుంచి 18 గంటల పాటు అధికారులు, కూలీలు శ్రమించారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే రహదారులను అభివృద్ధి చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తో పాటు ఇంజినీరింగ్‌ విభాగానికి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.



Tags:    

Similar News