హైదారాబాద్ రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ : మంత్రి కేటీఆర్

Update: 2020-02-05 11:06 GMT

నగర వాసులు ఎప్పటినుంచో ఎదురు చుస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోరైలు కారిడార్ ను ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజున ప్రగతిభవన్ లో రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పలువురు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మూడో కారిడార్ ప్రారంభంతో దేశంలోనే హైదారాబాద్ మెట్రో రైల్ రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా అవతరిస్తుందన్నారు.

ఈ నేపథ్యంలోనే 7వ తేదీని జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు, నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్లను ఏర్పట్లన్నీ పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుడా చూడాలని, కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమయిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని మెట్రో అధికారులను మంత్రి అదేశించారు. ఈ లైన్ ద్వారా మెట్రో ఎంతో మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఈ మెట్రో ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించవచ్చని తెలిపారు. ఇక పోతే హైదరాబాద్ నగరానికే మణిహారంగా ఉన్న మెట్రో సర్వీసులకు మరింత పేంచేందుకు శంషాబాద్ వరకు అతి త్వరలో లైన్ పొడగింపు చేస్తామని ఆయన తెలిపారు.

ఇక ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో పాటు హైదరాబాద్ మెట్రోరైల్, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖాధికారులు, నగర పోలీస్ కమీషనర్, ఎల్ అండ్ టి ప్రతినిధులు పాల్గొన్నారు.




Tags:    

Similar News