ఇచ్చోడ సీఐపై బదిలీ వేటు..కరీంనగర్‌ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ ఉత్తర్వులు

ఇచ్చోడలో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. కరీంనగర్‌ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయి.

Update: 2020-05-18 10:57 GMT

ఇచ్చోడలో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. కరీంనగర్‌ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయి. ఈ అవినీతి, ఆరోపణలు ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ దృష్టికి రావడంతో ఆయన విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల కిందట ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలబడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇచ్చోడ సీఐగా ఎవరిని నియమించలేదని ఆయన తెలిపారు.

ఇక పోతే సీఐ శ్రీనివాస్ అంతకుముందు ఇదే జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. ఏడాది క్రితమే పదోన్నతి పొంది ఇచ్చోడ సీఐ విధులను నిర్వహిస్తున్నారు. కాగా అతి తక్కువ కాలంలోనే ఆయన అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడంతో అధికారులు శాఖ పరమైన విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగిస్తుంది. గతంలో కూడా ఇదే స్టేషన్లో సీఐగా విధులను నిర్వహిస్తున్నసతీష్‌ కూడా అవినీతి, ఆరోపణలు ఎదుర్కున్నారు. దీంతో పై అధికారులు సతీష్ పై సస్పెన్షన్‌ వేటు వేశారు. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీనివాస్ సీఐగా పదోన్నతి పొంది సీఐగా బాధ్యతలను స్వీకరించారు. ఇక ఒకే స్టేషన్లో వెంట వెంటనే ఇద్దరు అధికారులు అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.

Tags:    

Similar News