Coronavirus: కరోనా నివారణకు హైదరాబాద్ ప్రొఫెసర్ సంచలన ఆవిష్కరణ

అతి కొద్దికాంలోనే కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది.

Update: 2020-03-28 16:31 GMT

అతి కొద్దికాంలోనే కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కొద్ది కాలంలోనే ఇంత మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటి వరకూ ఏ దేశంలో కూడా వ్యాక్సిన్ ను కనిపెట్టలేకపోయారు. కానీ హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు(హెచ్‌సీయూ)కు చెందిన ఓ ప్రొఫెసర్ కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ ను కనిపెట్టారని చెపుతున్నారు. ఈ విషయాన్ని హెచ్‌సీయూ ఒక ప్రకటనను విడుదల చేసింది. హెచ్‌సీయూలో బయో కెమిస్ట్రీ విభాగంలో పని చేసే ప్రొఫెసర్ సీమా మిశ్రా దీన్ని తయారు చేసి దానికి టీ-సెల్ ఎపిటోమ్ అని పేరు కూడా పెట్టారని వారు తెలిపారు. ఏ వ్యాక్సిన్ కూడా కనిపెట్టగానే ఉపయోగంలోకి రాదని, అలాగే ఈ వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం అమలులోకి రాలేదని ఆమె అన్నారు.

శాస్త్రవేత్తల కమ్యూనిటీతో ఈ వ్యాక్సిన్ పై పూర్తిస్థాయిలో అవగాహన కోసం చర్చలు జరపాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన దశలోనే ఉందని ఆమె వెల్లడి చేసారు. ఈ కణాలు మనిషి శరీరంలో కరోనా వైరస్ ను మాత్రమే చంపేస్తుందని, ఆరోగ్యవంతంగా ఉన్న ఏ కణాలకు ఇది హాని తలపెట్టదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెల్లడించింది. అయినే దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి ఇది అమలులోకి వస్తుందా, లేదా అన్న విషయాలను తెలుతామని వారు స్పష్టం చేసారు. ఇందుకోసం మిశ్రా తయారు చేసిన ఎపిటోప్స్‌పై ఈమె చేసిన ఆన్‌లైన్ అధ్యయనాన్ని కెమ్‌రిక్సివ్ అనే జర్నల్ కు పంపినట్టు చెపుతున్నారు. ఇక అంతకుముందు కూడా సీమా వైరస్‌కు సంబంధించిన స్ట్రక్చర్, నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడే ఫార్ములాను కంప్యూటర్ సాయంతో కనుగొన్నారని ఆమె తెలిపారు.


Tags:    

Similar News