పొలంలో తవ్వకాలు..గుప్తనిధులు లభ్యం

పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ వ్యక్తికి లంకె బిందెలు లభించాయి.

Update: 2020-06-03 11:28 GMT

పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ వ్యక్తికి లంకె బిందెలు లభించాయి. వికారాబాద్‌ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. పూర్తివివరాల్లోకెళితే జిల్లాలోని పెరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన యాకూబ్ అలీ అనే రైతు ఆయన పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో గుప్తనిధులు లభించాయి. పూర్వకాలంలో వాడినటువంటి రాగి పాత్రలు భూమిలోపలి నుంచి బయటపడ్డాయి. వాటిని గమనించిన రైతు, అతనితో పాటు ఉన్న కొంత మంది వాటిని వెంటనే బయటకు తీసి చూసారు. వాటిని లంకె బిందెలుగా గుర్తించారు. కాగా ఆ రాగిపాత్రల్లో వెండి, బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ గుప్త నిధులు బయట పడ్డాయన్న విషయం ఆనోటా ఈ నోటా రెవెన్యూ అధికారులకు, పోలీసులు తెలిసింది. దీంతో అధికారులు పొలంలోకి వెళ్లి గుప్త నిధులు దొరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువాత పొలం యజమాని యాకూబ్‌ను పిలిచి విచారన జరిపారు. దీంతో పొలం యజమాని అధికారులతో మాట్లాడుతూ గుప్త నిధులు ఏమీ దొరకలేదని, కొన్ని రాగి పాత్రలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. దీంతో అధికారులు ఆ పాత్రలను స్వాధీనం చేసుకొని ఘటపై దర్యాప్తు చేస్తున్నారు.  


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News