Hyderabad: హైదరాబాద్‌ వారసిగూడాలో దారుణం

Update: 2020-01-24 05:00 GMT

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. వారసిగూడాకు చెందిన ఇర్ఫానా అనే బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తమబిడ్డను హత్య చేసి ఆపై బిల్డింగ్‌ పై నుంచి కిందపడేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న సీసీకెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.  

Tags:    

Similar News