ఆస్పత్రుల్లో 5 వేల ఐసీయూ పడకలు..

తెలంగాణలో రాష్ట్రంలో కోరాన పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు అత్యధికంగా పెరుగుతున్నాయి.

Update: 2020-06-04 06:28 GMT

తెలంగాణలో రాష్ట్రంలో కోరాన పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు అత్యధికంగా పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడనుంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం యంత్రాంగం ఎంత మంది కరోనా బాదితులు వచ్చినా వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించే విధంగా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైద్యానికి అవసరమైన పరికరాలు, పీపీఈ కిట్లు, మందులు, ఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం పెంపు లాంటి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే పూర్తి స్ధాయిలో కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రితో పాటు ఇతర ఆస్పత్రులను కలుపుకుని 5 వేల పడకలను ఏర్పాట్లుచేస్తున్నారు. అంతే కాకుండా కరోనా చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే హెచ్‌సీక్యూ మందులు 48 లక్షలు, త్రీ లేయర్‌ మాస్కులు 50 లక్షలు, పీపీఈ కిట్లు 7.5 లక్షలు, ఎన్‌- 95 మాస్కులు 11.50 లక్షలు, అజిత్రోమైసిన్‌ మందులు 75 లక్షలు సిద్ధంగా ఉంచింది.

వాటితో పాటుగానే ఇటీవలే గచ్చిబౌలిలో ప్రారంభించిన టిమ్స్‌ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి 662 మంది సిబ్బంధిని కూడా నియమించనుంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్న ఐసీకయూ పడకల వివరాలను చూసుకుంటే గాంధీ ఆస్పత్రిలో 1,500 పడకలను సిద్దం చేయనున్నారు. అదే విధంగా కింగ్‌ కోఠి ఆస్పత్రిలో 300 పడకలను సిద్దం చేస్తున్నారు. అందే కాక చెస్ట్‌ దవాఖానలో 100 పడకలు, ఎంజీఎంహెచ్‌, వరంగల్‌ ఆస్పత్రిలో 150 పడకలు, సరోజినీ కంటి దవాఖానలో 150 పడకలు, గచ్చిబౌలి స్పోర్స్‌ కాంప్లెక్స్‌ 1,500 పడకలు సిద్దం చేయనున్నారు. వీటితో పాటుగానే మరో 13 జిల్లాలలోని ఆస్పత్రుల్లో 1,300 పడకలను సిద్దం చేస్తున్నారు. 

Tags:    

Similar News