నేడు విద్యాసంస్థల బంద్

Update: 2019-07-10 03:13 GMT

విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు విద్యాసంస్థ బంద్ నిర్వహిస్తున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని.. తదితర డిమాండ్లతో బంద్‌ తలపెట్టినట్లు కమిటీ నేతలు ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీ నిరసనలో పాల్గొననున్నాయి. బంద్‌ నేపథ్యంలో నగరంలోని చాలావరకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బుధవారం సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనూ బోధన నిలిచిపోనుంది.

Tags:    

Similar News