మంత్రి హరీష్ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ

♦ హరీష్‌రావు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు ♦ నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

Update: 2019-11-03 08:44 GMT

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. అమీన్‌పూర్ మండలం బీరంగూడలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్కడకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు హరీష్‌రావు ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.



Tags:    

Similar News