11న గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే ప్రయత్నం భాగంగా ఈ నెల 11 వ తేదీన సొంత నియోజక వర్గం గజ్వేల్ లో పర్యటించనున్నారు.

Update: 2019-12-08 05:32 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 11 వ తేదీన సొంత నియోజక వర్గం గజ్వేల్ లో పర్యటించనున్నారు. పర్యటన ఖరారు కావడంతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు శనివారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పోలీస్‌కమిషనర్ జోయల్‌డేవిస్, జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, వివిధశాఖల అధికారులతో సమావేశమయ్యారు. కేసీఆర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీబందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆ‍యన అన్నారు.

ఈ పర్యటనలో భాగంగా మహతి ఆడిటోరియం హాల్‌లో ఉదయం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని, సందర్శకులకు పాసులు జారీచేయాలని ఆదేశించారు. అధికారులకు, నాయకులకు పార్కింగ్ కు ఇబ్బంది కలగకూడదన్నారు. పార్కింగ్ ఏర్పాట్లు, రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ములుగు మండలంలోని అటవీకళాశాల, ఉద్యాన యూనివర్సిటీ, గజ్వేల్ పట్టణంలోని సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, ఇంటిగ్రేటేడ్ ఆఫీస్ కాంప్లెక్సు, మహతి ఆడిటోరియంను సీఎం ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.

కేసీఆర్ పర్యటనలో భాగంగా ములుగులో నిర్మించిన అటవీ కళాశాలను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని మెట్టుపాలయం ఉన్న అటవీ కళాశాల కన్నా ఎక్కువ ఆధునిక హంగులు, అత్యున్నత ప్రమాణాలతో ఈ కళాశాలను నిర్మించారు. ఇప్పటివరకూ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తాత్కాలికంగా కొనసాగిన బీఎస్సీ ఫారెస్ట్రీ తరగతులు ఇకపై సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న ములుగు క్యాంపస్ లో కొనసాగనున్నాయి.  

Tags:    

Similar News