జగన్, కేసీఆర్ భేటీలో చర్చించిన అంశాలు ఇవేనా!

Update: 2019-08-01 16:24 GMT

జెరూ‌సలెం పర్యటనకు ముందు ఏపీ సీఎం జగన్ బిజీ, బిజీగా గడిపారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో వరుస సమావేశమయ్యారు.. భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లను కలవడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న జగన్ ముందుగా నరసింహన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు గవర్నర్‌తో చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల ఆస్తులు, నీటి పంపకాలపై గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు సమాచారం.

గవర్నర్‌తో భేటీ తర్వాత జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ భేటీలో ఏపీ భవన్ విభజన, సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల బదిలీలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మంచినీటి సమస్యలు, విభజన సమస్యలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను జగన్‌కు కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలని అనే విషయంపై ఇరు సీఎంల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. విభజన సమస్యలపై చర్చించేందుకే కేసీఆర్‌‌ను జగన్ కలిసినట్లు చెబుతున్నా.. ఇలా ఉన్నట్టుండి ఇద్దర్ని కలవడం ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News