ఈఎస్‌ఐ స్కామ్‌లో నిందితులను 2వ రోజు ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు

Update: 2019-11-10 04:39 GMT
acb

ఈఎస్‌ఐ స్కాంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రెండో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. శనివారం మొదటి రోజు మాజీ డైరెక్టర్‌ దేవికారాణిని అధికారులు ప్రశ్నించారు. దేవికారాణితోపాటు పద్మ, వసంత ఇందిర, శ్రీహరిబాబు, శివనాగరాజును ప్రశ్నించారు. అయితే దేవికారాణి కొన్ని విషయాలు తనకు తెలియదని చెప్పే ప్రయత్నం చేసినా తనిఖీల్లో తమకు లభించిన పత్రాల ఆధారంగా ప్రశ్నించారు. మొత్తం 8 డొల్ల కంపెనీలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా జరిపిన లావాదేవీల గురించి కస్టడీలో నిందితులను వేర్వేరుగా ప్రశ్నించి వారి సమాధానాల్ని రికార్డు చేశారు. కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసిన దేవికారాణి వాటిని ఎక్కడ భద్రపరిచారనే వివరాలురాబట్టే ప్రయత్నం చేశారు. 

Tags:    

Similar News