బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కూ వర్షం దెబ్బ

Update: 2019-06-11 11:19 GMT

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక‌, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. బ్రిస్టల్‌లో వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఇప్పటి వరకు టాస్ పడలేదు. పిచ్ తడవకుండా కప్పిన కవర్లపై వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది అలుపుసొలుపు లేకుండా నీటిని తోడుతూనే ఉన్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ్యాచ్‌ల‌కు వ‌ర్షం తీవ్రంగా అంత‌రాయం క‌ల్గిస్తోంది. సోమ‌వారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌కు కూడా వ‌రుణుడు అడ్డంకిగా మార‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. 

Tags:    

Similar News