టీమిండియా బిజీ బిజీ.. ఈ సంవత్సరంలో ఎవరెవరితో ఆడుతుందంటే..

Update: 2019-07-17 15:05 GMT

నిన్నటి వరకూ వరల్డ్ కప్ బిజీలో గడిపిన టీమిండియా.. రాబోయే సంవత్సర కాలంలో మరింత బిజీ షెడ్యూల్ తో సిద్ధమవుతోంది. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనతో భారత జట్టు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అటు తరువాత.. ఇండియాలోనే పలు సిరీస్ లలో పాల్గొంటుంది. మళ్ళీ 20 20 లో విదేశీ పర్యటనకు వెళుతుంది. న్యూజిలాండ్ లో వచ్చే ఫిబ్రవరిలో పర్యటించనుంది.

షెడ్యూల్ ఇదీ..

- సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా సొంతగడ్డపై 3టి20లు, 3 టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది.

- బంగ్లాదేశ్ జట్టు నవంబర్ లో భారత్ లో పర్యటనకు వస్తుంది. టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య 3 టి20 మ్యాచ్ లు, 2 టెస్టులు ఈ సందర్భంగా జరుగుతాయి.

- ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా విండీస్ జట్టు ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా 3 టి20లు, 3 వన్డేలు ఆడనున్నారు.

- వచ్చే ఏడాది ఆరంభంలో జింబాబ్వే జట్టు ఇండియా వస్తుంది ఆ జట్టుతో భారత్ తో 3 టి20లు ఆడుతుంది.

- ఆ తరువాత సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా టీమిండియా అక్కడ 5 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.

- దక్షిణాఫ్రికా జుట్టు 3 వన్డేల కోసం మళ్లీ భారత్ రానుంది. ఈ సిరీస్ మార్చి 12న ఆరంభం అవుతుంది 

Tags:    

Similar News